Monday, December 23, 2024

తునికాకుతో గిరిజనులకు ఆర్థిక భరోసా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తునికాకు సేకరణ ఆదివాసీలకు రెండో పంటగా, వారి జీవనానికి ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లి పరిధిలోని నెన్నెల మండల కేంద్రంలో గురువారం తునికాకు సేకరణదారులకు బోనస్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తునికాకు సేకరణ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కూలీలకు బోనస్ రూపంలో రెవెన్యూ నెట్ షేర్ ను చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2016 నుంచి 2021వరకు రూ.200 కోట్లను బోనస్ ( నెట్ రెవెన్యూ) చెల్లిస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సిర్పూర్ నియోజకవర్గం నుంచి తునికాకు కూలీలకు బోనస్‌ను చెల్లించే పక్రియను ప్రారంభించామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో రూ.10.45 కోట్లను లబ్ధిదారులకు చెల్లిస్తున్నామని, నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని వెల్లడించారు. మరోవైపు బీడీ ఆకుల సేకరణ రేట్ కట్టకు రూ. 2.05 పైసల నుంచి రూ. 3కు పెంచామని, ఈ సీజన్ నుంచి ఈ ధరలు వర్తింపజేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, పిసిసిఎఫ్ ఆర్.డొబ్రియల్, డిఎఫ్‌ఓ ఆశిష్‌సింగ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News