- Advertisement -
యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉంది. ‘పుష్ప’ వంటి భారీ తెలుగు చిత్రంతో పాటు ఆమెకు హిందీలో రెండు సినిమాలున్నాయి. యూత్‌లో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక లాక్‌డౌన్ సందర్భంగా ఆమె తన అభిమానులు, ఫాలోవర్స్‌కి కొన్ని విషయాలు చెప్పింది. మనకు జీవితంలో నిజంగా ఏది అవసరమో తెలుసుకోండి అని రష్మిక పేర్కొంది. “నా ఫ్రెండ్ చెప్పిన ఒక మంచి మాట మీకు చెబుతున్నా. మీకు ఆనందాన్నిచ్చే దానిపైనే మీ సమయాన్ని గడపండి. లేదా మీకు డబ్బు తెచ్చిపెట్టే లేదా జ్ఞానం ఇచ్చేదానిపైనో దృష్టి పెట్టండి. మిగతాదేదైనా అనవసరం”అని ఈ బ్యూటీ తెలియజేసింది.
- Advertisement -