కేంద్రానికి నాగాలాండ్ ప్రభుత్వం వినతి
కొహిమా : నాగాలాండ్ సమస్యలపై ఉన్న విభేదాలను తొలగించి వీలైనంత త్వరలో పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) లకు నాగాలాండ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి నెయిఫ్లు రియో, ,మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌పిఎఫ్ శాసన సభా పక్ష నాయకుడు టిఆర్ జెలియాంగ్, మంత్రి నెయిబా క్రోను కేంద్ర ప్రభుత్వ కొత్త మధ్యవర్తి ఎకె మిశ్రా, ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) ప్రతినిధులతో వేర్వేరుగా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆదివారం జరిగిన ఈ సమావేశాల్లో నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం మిశ్రాకు, ఎన్‌ఎస్‌సిఎం(ఐఎం)లకు వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని నాగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. కొన్ని అంశాలపై నాగాలాండ్ గ్రూపుకు , కేంద్రానికి మధ్య విభేదాలు ఉన్నాయని, ఇవి త్వరలో పరిష్కరించుకోవలసి ఉందని నాగాలాండ్ శాసనసభ్యులు, ఎన్‌ఎస్‌సిఎన్ నేతలు, అధికారులు పేర్కొన్నారు.