Wednesday, January 8, 2025

గ్రీన్ బకెట్ రెస్టారెంట్‌కు జరిమానా

- Advertisement -
- Advertisement -

చౌటుప్పల్: కుళ్లిపోయిన చికెన్‌తో బిర్యానీ తయారు చేస్తున్న చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని గ్రీన్ బకెట్ రెస్టారెంట్ నిర్వాహకులకు శుక్రవారం స్థానిక మున్సిపల్ అధికారులు రూ. 5 వేల జరిమానా విధించారు. రెస్టారెంట్ ను మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేయడంతో అసలు విషయం బయట పడింది.

ఆహార పదార్ధాల్లో కుళ్లిపోయిన చికెన్‌ను వినియోగిండంతో పాటు ఆహార వ్యర్ధాలను ప్రక్కనే వున్న డ్రైనేజీలో పడవేస్తూ దుర్గంధంగా మార్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులకు జరిమానా విధించడమే గాకుండా మరోసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే సీజ్ చేస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, జవాన్ అంజయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News