Sunday, November 17, 2024

టూలెట్ బోర్డుల జరిమానాలపై సర్వత్రా విమర్శలు

- Advertisement -
- Advertisement -
Fine for tolet board in hyderabad
వెనక్కి తగ్గిన బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్
బహిరంగ ప్రదేశాల పోస్టర్లపైనే జరిమానాలు

హైదరాబాద్: నగరంలో చిన్న పోస్టర్ కనిపిస్తే చాలు ఎడాపెడా జరిమానాలను విధిస్తున్న జిహెచ్‌ఎంసి సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అద్దెలకు సంబంధించి మూసాపేట్ సర్కిల్ పరిధిలో ఓ ఇంటి యాజమాని తన ఇంటికే టూలెట్ బోర్డను పెట్టారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ విభాగం సదురు యజమానికి రూ.2వేల జరిమానాను విధిస్తూ నోటీసులు పంపడంతో ఇది తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎన్‌పోర్స్‌మెంట్ విభాగం కాస్తా వెనక్కి తగ్గింది. జిహెచ్‌ఎంసి పరిధిలో వ్యాపార, వాణిజ్య కార్యకలపాలకు సంబంధించి కొత్త యాక్టు అమల్లో ఉందని, ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి మాత్రమే జరిమానాలను విధిస్తున్నట్లు వెల్లడించింది.

నగరంలో వాణిజ్య వ్యాపార ప్రకటనలకు సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో ఏలాంటి పోస్టర్లు, స్టిక్కర్లు, బ్యానర్లు,ప్లెక్సీలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేదం ఉందని పేర్కొంది. దీంతో ఇళ్లు, వాణిజ్య సంస్థల అద్దెలకు సంబంధిచి వ్యాపార వర్గాలు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు నగరంలో బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున అనధికారికం పోస్టర్లు, స్టిక్కర్లు బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపింది. దీంతో ఇలాంటి సంస్థలకు చెందిన వాటిపైనే జరిమానాలను విధిస్తున్నట్లు స్పష్టంచేసింది. వ్యక్తిగత ఇళ్ల అద్దెలకు సంబంధించి వారి పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసే బోర్డులకు సంబంధించి ఏలాంటి జరిమానాల ఉండవని స్పష్టం చేసింది. పోరపాటున జరిమానాలను విధించి ఉంటే వాటిని గుర్తించి తొలగించడం జరుగుతుందని బుధవారం జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ , డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News