Wednesday, January 22, 2025

గూగుల్‌పై రూ.1,337 కోట్ల జరిమానాను సమర్థించిన ఎన్‌సిఎల్‌ఎటి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గూగుల్‌పై సిసిఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) విధించిన రూ.1,337 కోట్ల జరిమానా ఎన్‌పిఎల్‌ఎటి(నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యూనల్) సమర్థించింది. సిసిఐ అక్టోబరు 21న అన్‌ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీస్ కేసులో గూగుల్‌పై ఈ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఎకోసిస్టమ్‌లో గూగుల్ తన స్థానాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఎన్‌సిఎల్‌ఎటి గూగుల్ జరిమానా చెల్లించడానికి 30 రోజుల సమయం ఇచ్చింది. ఎన్‌సిఎల్‌ఎటి ద్విసభ్య బెంచ్ సిసిఐ విచారణ సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించలేదని పేర్కొంది.

గూగుల్‌లో సిసిఐ ఆర్డర్ పక్షపాతంతో ఉందనే వాదనను బెంచ్ అంగీకరించలేదు. సిసిఐ ఆరోపణల్లో గూగుల్‌పే ద్వారా యాప్‌కి సంబంధించిన ప్రతి చెల్లింపును ప్రాసెస్ చేయమని ప్లే స్టోర్‌లో ప్రతి యాప్‌ను గూగుల్ ఒత్తిడి చేసింది. అంటే ప్రతి యాప్‌లో కొనుగోళ్లు గూగుల్ పే ద్వారా చేయాలి. దీనిపై యాప్ పబ్లిషర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడి తప్పని సిసిఐ పేర్కొంది. దీని కారణంగా యాప్ పబ్లిషర్లు మెరుగైన డీల్‌లను పొందినప్పటికీ ఇతర చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లతో టై-అప్ చేయలేరు. అలాగే, ఇది మిగిలిన చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లను తప్పుగా అణిచివేసేందుకు, మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని సృష్టించే సాధనంగా పరిగణించారు. ఆండ్రాయిడ్ గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గూగుల్ యాప్‌లను తప్పనిసరి చేయడం కూడా తప్పిదంగా సిసిఐ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News