- Advertisement -
హైదరాబాద్: నగరంలోని పార్కుల్లో భద్రతపై జిహెచ్‌ఎంసి ప్రత్యేక దృష్టి సారించింది. నగరవాసులకు ఆటవిడుపు, ఆహ్లాదకరాన్ని పం చాల్సిన పార్కుల అడ్డగా చేసుకుని కొంత మంది అక్కడే తిష్ట వేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో అలాంటి వారికి చెక్కు పెట్టేందుకు బల్దియా చర్యలు చేపట్టింది. ఇకమీదట పార్కుల్లో నిర్దేశించి సమయం వరకే సందర్శకులు అనుమతించాలని నిర్ణయించింది. నిబంధనలను ఎవరూ ఉల్లడించే వారిపై జరిమానాలను విధించనుంది.ఇందుకు సం బంధించి నగరంలోని పలు పార్కుల వద్ద సమయ పాలనను తెలియజేస్తూ అధికారులు ప్రత్యేకంగా బ్యానర్లను ఏర్పాటు చేశారు. పార్కుల గేట్లును మూసిన తర్వాత ఎవరైన అక్రమంగా పార్కుల్లోకి ప్రవేశిస్తే వారికి రూ. 500ల జరిమానాను విధించనున్నట్లు హెచ్చరిస్తూ బ్యానర్లను కట్టారు.
- Advertisement -