Thursday, November 14, 2024

పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -
తెలంగాణ అమరుల స్మారక చిహ్నం పనులను పరిశీలించిన మంత్రి వేముల

హైదరాబాద్ : తెలంగాణ అమరుల స్మారక చిహ్నం పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. మంత్రి అమరవీరుల స్మారకం నిర్మాణం పనులను పర్యవేక్షిస్తూ పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 22న ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుండడంతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లతో పాటు తాత్కాలిక రూట్ మ్యాప్ గురించి మంత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. సచివాలయ ప్రాంగణంలో మాత్రమే అన్ని వాహనాలకు పార్కింగ్ ఉండేలా చూడాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఐదు వేల మందికి పైగా జానపద కళాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. సీటింగ్ ఏర్పాట్లు, బందోబస్తు ప్రణాళిక తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్‌అండ్‌బి కార్యదర్శి శ్రీనివాసరాజు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ, ఈఎన్సీ ఆర్ అండ్ బి గణపతిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News