Monday, January 20, 2025

నాటో కూటమిలోకి ఫిన్‌లాండ్..

- Advertisement -
- Advertisement -

బ్రసెల్స్: నాటో సైనిక కూటమిలో ఫిన్‌లాండ్ చేరుతున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్ట్టోల్టెన్‌బర్గ్‌తెలిపారు. మంగళవారం నుంచి 31వ సభ్యదేశంగా ఫిన్‌లాండ్ మారనుందని జెన్స్ వెల్లడించారు. బ్రసెల్స్‌లోని విలేఖరుల సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

నేటి నుంచి నాటోలో పూర్తిస్థాయి సభ్య దేశంగా పరిగిణించనున్నామని మీడియాకు తెలిపారు. నాటో విదేశాంగ మంత్రులు బ్రస్సెల్‌లో సమావేశమై ఫిన్‌లాండ్ సభ్యత్వాన్ని ఆమోదించారని, చివరిగా టర్నీ ఆమోదించినట్లు వివరించారు. మంగళవారం యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అధికారక పత్రాలను అందజేస్తారని స్టోల్టెన్‌బర్గ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News