Monday, January 20, 2025

ఫిన్లాండ్ హ్యాపి దేశం

- Advertisement -
- Advertisement -
Finland ranked happiest country 2022
వరుసగా ఐదోసారి

హెలెంస్కీ : సంతోషాన్ని మించింది లేదు. వరుసగా ఐదోసారి కూడా ప్రపంచపు అత్యంత సంతోషపు దేశంగా పిన్లాండ్ తన ఖ్యాతిని మరో సారి నిలబెట్టుకుంది. ప్రపంచవ్యాప్త ఉద్రిక్త పరిణామాలు, వైరస్ కాటులు, పేదరికాలు నిరుద్యోగాల దశలో సంతోషపు దేశాల జాబితాలో దేశాల స్థానాలు ఆయా దేశాలలోని పరిస్థితిని తెలియచేస్తాయి. ఐరాస ఆధ్వర్యంలో రూపొందించిన ఈ హ్యాపీ సూచిలో ఫిన్లాండ్ తొలిస్థానంలో నిలిచింది. ఇది వరుసగా ఐదు దఫాలుగా నిలబెట్టుకున్న స్థానం అయింది. ఇక అత్యంత బాధాకర సంతోషపు పాలు తక్కువైన దేశంగా తిరిగి అఫ్ఘనిస్థాన్ ఉంది. తరువాతి స్థానంలో లెబనాన్ ఉంది. సెర్బియా, బల్గేరియా, రొమేనియాలు సంతోషపు సూచీలో ప్రముఖంగా నిలిచాయి.

శుక్రవారం ఈ సూచీని ఐరాస వర్గాలు విడుదల చేశాయి. లెబనాన్, వెనిజులా, అఫ్ఘనిస్థాన్‌లు అధోపరిస్థితిని చాటుకున్నాయి. ఇప్పుడు ఆర్థిక క్షీణతను చవిచూస్తోన్న లెబనాన్ మొత్తం 146 దేశాల ఈ హ్యాపీ దేశాల జాబాతాలో చివరి నుంచి రెండో దశలో ఉంది. జింబాబ్వేకు తరువాతి స్థానంలో ఉంది. అఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి దారుణంగా ఉందని,ఈ సారి సరైన విధంగా ఆహారం అందకపోతే దాదాపు పది లక్షల మంది పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని ఈ ఇండెక్స్‌లో తెలిపారు. ఫిన్లాండ్ తరువాత డానిస్, తరువాత ఐస్‌లాండిక్, స్విస్, నెదర్లాండ్స్ నిలిచాయి. యూరప్ దేశాలలోనే అత్యధికంగా సంతోషం వెల్లివిరుస్తోందని సూచీతో తేలింది. అమెరికా ఈ జాబితాలో 16వ స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో బ్రిటన్,20 వ స్థానంలో ఫ్రాన్స్ నిలిచాయి. ఈ జాబితాలో రష్యా 76వ ర్యాంకులో ఉంది . భారతదేశం జాబితాలో 139వ ర్యాంకులో ఉంది. చైనా 84వ స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News