- Advertisement -
హెల్సింకీ : ఫిన్లాండ్‌లో తాజాగా కరోనా ఎంయూ వేరియంట్ మొదటి కేసు నమోదైంది. దీంతో ఈ వైరస్ వ్యాపించిన దేశాల సంఖ్య 40 కి చేరింది. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ అదనంగా ముప్పు కలిగించబోదని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. దక్షిణ అమెరికా లోని కొలంబియాతోపాటు ఇతర దేశాల్లో ఎంయూ వేరియంట్ కేసులు పెరుగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది.
- Advertisement -