Thursday, July 4, 2024

ఆదాయపు పన్నులో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచొచ్చు

- Advertisement -
- Advertisement -

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడమంటే ప్రతీ శాలరీడ్ ట్యాక్స్ పేయర్ కు ప్రయోజనమే. ఇంకా ఎక్కువ సంపాదించే వారికి కూడా.

హైదరాబాద్: పన్ను చెల్లించేవారికి ఊరటనిచ్చే కబురును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నిర్మలా సీతారామన్ ఇప్పటికే బడ్జెట్ విషయంలో పబ్లిక్ కన్సల్టేషన్ చేపట్టారు.

2023 బడ్జెట్ లో రూ. 50000 జీతగాళ్లకు, పింఛనుదారులకు స్టాండర్డ్  డిడక్షన్ ప్రవేశపెట్టారు. ఇంకా ట్యాక్సేబుల్ ఇన్కమ్ లో సెక్షన్ 87ఏ కింద రూ. 7 లక్షల వరకు రిబేట్ ఇచ్చారు. వ్యక్తుల ట్యాక్సేబుల్ ఇన్కమ్ రూ. 3 లక్షల పైబడిన వారు 5 శాతం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్  పరిమితి పెంచడం వల్ల జీతగాళ్లకు, ఎక్కువ ఆదాయం వారికి ప్రయోజనం చేకూరగలదు.

స్టాండర్డ్ డిడక్షన్ ను మొదట రూ 40000కు ప్రవేశపెట్టినప్పటికీ 2019లో దానిని రూ. 50000 కు పెంచారు. అయితే నేటి జీవన ప్రమాణ స్థాయిని బట్టి చూస్తే ఇదో లెక్కలోకి రాదని తేలుతోంది. అందుకే కనీస పరిమితిని రూ. 1 లక్షకు పెంచాలని చాలా మంది కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News