- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలోని రామాలయం రోడ్డులో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టివి రిపేరింగ్ సెంటర్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -