Sunday, January 19, 2025

హోం మంత్రి అమిత్ షాపై ఫిర్యాదు!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రచారం కోసం రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ(బిజెపి) ర్యాలీ నిర్వాహకులపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డి.కె.శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శత్రుత్వం, విద్వేషం రెచ్చగొట్టేలా,  ప్రతిపక్షాన్ని అపకీర్తిపాలు చేసేలా అమిత్ షా మాట్లాడుతున్నారని ఫిర్యాదుచేశారు.

అధికారంలోకి కాంగ్రెస్ వస్తే అల్లర్లు చెలరేగుతాయని అమిత్ షా అనడాన్ని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డి.కె.శివకుమార్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ‘చట్టపరంగా చర్య తీసుకోండి. ఒకవేళ ఓ సాధారణ వ్యక్తి ఇలా చేసి ఉంటే వెంటనే అరెస్టు చేసేవారే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు చెలరేగుతాయని కేంద్ర హోం మంత్రి అనకూడదు. ఆయన కేంద్ర హోం మంత్రి. బిజెపి స్టార్ ప్రచారకుడు కాదు’ అన్నారు.

‘నాపై ఏమి లేకుండానే 20కిపైగా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అక్కడ ఫిర్యాదు దాఖలు చేశాకే మేము ఇక్కడికి వచ్చాము’ అన్నారు డి.కె. శివకుమార్.

‘హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌కు మేము వచ్చాము. మేము కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాము’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా ధ్రువీకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News