- గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
- అభ్యర్థి పరీక్ష రాయకుండానే పరీక్ష కేంద్రం నుంచి బయటకు..
- టిఎస్పిఎస్సికి సమాచారం అందించిన సిద్దిపేట కలెక్టర్
సిద్దిపేట: టిఎస్పిఎస్సికి నిబంధనలకు అతిక్రమించినందు కు గ్రూపు1 ప్రిలిమ్స్ పరీక్ష వ్రాసే అభ్యర్థిపై చట్ట ప్రకారం అరెస్టు చేసి ఎ ఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అ నూహ్య సంఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ మాట్లాడుతూ టిఎస్పిఎస్సి నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరై పరీక్ష పూర్తి సమయం మధ్యాహ్నం 1:00 వరకు పరీక్ష కేంద్రంలో ఉండకుండా ప్రారంభం సమయంలోనే పరీక్ష ప్రశ్నాపత్రం కూడా ఇవ్వకముందే ఉదయం 10:15 గంటలకు పరీ క్ష కేంద్రం నుండి బయటకు వచ్చిన సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల గ్రామానికి చెందిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థి బి. ప్ర శాంత్ తండ్రి పేరు వెంకటయ్యను చట్టం ప్రకారం అరెస్టు చేసి అతనిపై పోలీస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రి లిమ్స్ పరీక్ష రాసేందుకు ఉదయం నిర్ణీత సమయంలోపు పరీక్ష కేంద్రానికి చే రుకున్న అభ్యర్థి బి. ప్రశాంత్, తండ్రి వెంకటయ్య, గ్రామం బక్రిచెప్యాల, మం డలం సిద్దిపేట అర్బన్ ఉదయం 10 గంటల 15 నిముషాలకు ముందుగా పరీ క్ష నిర్వాహకులు ఇచ్చిన ఆన్సర్ ఓఎంఆర్ షీట్‌లో తన హాల్ టికెట్‌ని తప్పుగా నమోదు చేశారు. అభ్యర్థి బి.ప్రశాంత్ వెంటనే తాను చేసిన పొరపాటున గుర్తించి పరీక్ష రాసిన తనకు మార్కులు పడవనే ఉద్దేశంతో ఇంకా ప్రశ్నాపత్రం కూడా ఇవ్వకముందే ఓఎంఆర్ షీట్‌ను పరీక్ష హాల్లో వదిలి పరీక్ష పూర్తి సమ యం మధ్యాహ్నం 1:00 గంట వరకు పరీక్ష కేంద్రంలో ఉం డక ఉదయం 10 గంటల15 నిమిషాలకే పరీక్షా కేంద్రం బయటకు వచ్చాడన్నారు. దీన్ని గమనించిన పోలీస్ సిబ్బంది అతనిని అరెస్టు చేసి తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ మాల్ ప్రా క్టీస్ యాక్ట్ 1997 ప్రకారం అతనిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగిందని, ఈ విషయాన్ని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు తెలియజేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా సిద్దిపేటలోని 20 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.