Sunday, December 22, 2024

మోడీ డ్రెస్‌పై వ్యాఖ్యలు.. కీర్తి ఆజాద్‌పై కేసు

- Advertisement -
- Advertisement -

షిల్లాంగ్: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ధరించిన మేఘాలయాకు చెందిన గిరిజన తెగ ఖాసీ సాంప్రదాయ దుస్తులను అపహాస్యం చేస్తూ వ్యాఖ్యలు చేసిన టి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కీర్తి ఆజాద్‌పై మేఘాలయాలోని పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. హైన్యూట్రెప్ ఇంటెగ్రేటెడ్ టెరిటోరియల్ ఆర్గనైజేషన్(హెచ్‌ఐటిఓ) అధ్యక్షుడు డాన్‌బాక్ డఖర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కీర్తి ఆజాద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ప్రధాని మోడీ ఇటీవల ధరించిన ఖాసీ గిరిజన తెగకు చెందిన సాంప్రదాయ దుస్తులను అపహాస్యం చేస్తూ కీర్తి ఆజాద్ వ్యాఖ్యలు చేశారని, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న మహిళ డ్రెస్‌ను పోలుస్తూ ఆయన ప్రధాని మోడీ ధరించిన డ్రెస్‌ను కించపరిచారని డాన్‌బాక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా..తాను చేసిన వ్యాఖ్యలపై కీర్తి ఆజాద్ ఇదివరకే ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఖాసీ తెగ సాంప్రదాయాలను కించపరచడం తన ఉద్దేశం కాదని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News