- Advertisement -
ముంబయి: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)పై ఇటీవల ఓ ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలకుగాను హిందీ సినీ గేయ రచయిత జావేద్ అఖ్తర్‌పై సోమవారం ములుంద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. ముంబయి నగరానికి చెందిన న్యాయవాది సంతోష్ దుబే దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ ఎఫ్‌ఐఆర్ నమోదయింది.
జావేద్ అఖ్తర్ ఇటీవల ఓ న్యూస్‌ఛానల్ ఇంటర్వూలో తాలిబన్లకు, హిందూ అతివాదులైన ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య సారూప్యతను తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు. దీనిని ఆక్షేపిస్తూ క్షమాపణ కోరాలని ఆ న్యాయవాది జావేద్‌కు నోటీసు పంపాడు. కానీ దానికి ఆయన ప్రతిస్పందించలేదు. దాంతో ఆ న్యాయవాది ఐపిసి సెక్షన్లు 499, 500 కింద పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు జావేద్ అఖ్తర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదయింది.
- Advertisement -