- Advertisement -
న్యూఢిల్లీ : పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై సోమవారం సిబిఐ కొత్త కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సిఐ) నుంచి రూ.22 కోట్లు రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎగనామం పెట్టినట్టు చోక్సీతోపాటు అతని కంపెనీ గీతాంజలి జెమ్స్‌పై ఆరోపణలున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సుమారు రూ.13,500 కోట్లు టోకరా వేసిన కేసులో ఇప్పటికే సిబిఐ , ఈడీలు చోక్సీపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. డోమినికా దేశంలో ప్రస్తుతం చోక్సీ అదుపులో ఉన్నాడు. చోక్సీ లాయర్లు వేసిన పిటిషన్‌ను డొమినికన్ కోర్టు విచారిస్తోంది. 2018 జనవరి 4 నుంచి ఆంటిగ్వా, బార్బడోస్‌లో చోక్సీ తలదాచుకుంటున్నట్టు తెలిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసులో చోక్సీని భారత్‌కు రప్పించేందుకు సీబిఐ, ఈడీ ప్రయత్నాలు చేస్తోంది.
- Advertisement -