Sunday, January 19, 2025

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌సై ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

రామ్‌పూర్(యూపి): సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రెండు రోజుల క్రితం ఎన్నికల సమావేశంలో పోలీసులు, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆయన ‘రెచ్చగొట్టే’ మాటలన్నారని రామ్‌పూర్ అడ్మినిస్ట్రేషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. రామ్‌పూర్ ఉప ఎన్నికలకు పోల్ ప్యానెల్ ఏర్పాటుచేసిన వీడియో నిఘా బృందం ఇన్‌ఛార్జీ సుజేశ్ కుమార్ సాగర్ శుక్రవారం కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఒక రోజు కిందటే ఆయన మహిళలను కించపరుచుతూ వ్యాఖ్యలు చేశారన్న కేసు బుక్కయిన మరునాడే ఈ ఎఫ్‌ఐఆర్ దాఖలు కావడం ఇక్కడ గమనార్హం.

“సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అసిమ్ రజాకి మద్దతుగా ఓ పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగించిన ఆయన రాజ్యాంగ సంస్థలయిన పోలీస్, ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారికి వ్యతిరేకంగా మాట్లాడారు, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంచేశారు” అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆజం ఖాన్ తన ప్రసంగంలో “చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ మీరు ఇక్కడి వస్తారు, ఎంఎల్‌ఏకు ఓ సర్టిఫికేట్ ఇస్తారు, దాంతో మేము చప్పట్లు కొడతాం. మీరొక్కరే పిచ్చొళ్లను చేయొద్దు, మాకు కూడా అనుమతించండి” అన్నారని ఫిర్యాదులో ఉంది. డిసెంబర్ 5న రామ్‌పూర్ సదర్ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ఆయన సమాజ్‌వాదీ పార్టీ నామినీకి మద్దతుగా ప్రసంగించారు.

ఇదిలావుండగా కొత్వాలి పోలీస్ స్టేషన్ అధికారి కిషన్ అవతార్ వివరాలు చెబుతూ ఆజమ్ ఖాన్‌పై ఐపిసి సెక్షన్ 153-ఏ, 505(1), 505(బి) కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు. అంతేకాక ప్రజాప్రతినిధి చట్టంలోని సెక్షన్ 125 కింద కూడా ఆయన్ని బుక్ చేసినట్లు ఆ అధికారి తెలిపారు. 2019లో విద్వేష ప్రసంగం కేసు కింద ఆజం ఖాన్‌కు మూడేళ్ల కారాగార శిక్ష కూడా పడింది. ఆ కేసు ఎఫ్‌ఐఆర్ 2019 ఏప్రిల్ 9 కింద దాఖలయింది. ప్రస్తుతం ఆజమ్ ఖాన్ బెయిల్‌పై ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News