Friday, November 22, 2024

ఉదయనిధి, ప్రియాంక్ ఖర్గేలపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

లఖ్‌నవూ : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో కేసు నమోదైంది. ఉదయనిధితోపాటు ఆయనకు మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే పై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హర్షగుప్తా , రామ్ సింగ్ లోధి అనే ఇద్దరు న్యాయవాదులు వారిపై రాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా ఇదే అంశంపై బెంగళూరు దక్షిణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎన్‌ఆర్ రమేశ్ ఫిర్యాదు మేరకు బసవశంకరి ఠాణాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. తమిళనాడు లోని ఒక కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి స్టాలిన్ వేదికపై సనాతన ధర్మాన్నినిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News