- Advertisement -
బలియా(ఉత్తర ప్రదేశ్): సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపి డింపుల్ యాదవ్‌పై సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్ చేసినందుకు ఓ యువకుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈనెల 3, 7వ తేదీల్లో రామ్ ధని రాజ్‌భర్ అనే యువకుడు, ఎంపి డింపుల్ యాదవ్‌పై, ఆమె కులంపై ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాద్యమాలల్లో అభ్యంతరకర పోస్టింగ్ లు చేశాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ పి కార్యకర్తలు మనియార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఎస్ పి కార్యకర్తల ఫిర్యాదు మేరకు సదరు యువకుడిపై ఐపిసి, ఐటి యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మనియార్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జి మన్ తోష్ సింగ్ తెలిపారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్ లు పెట్టిన యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -