Sunday, December 22, 2024

శుక్రవారం రాశి ఫలాలు(01-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధి సంతృప్తికరంగానే ఉంటాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు.విజయం సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలలో మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది.

వృషభం – కొనుగోలు అమ్మకాల విషయాలలో మీ ఓర్పు సహనం, మాటల చాతుర్యం వల్ల లాభపడతారు. రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు. అభిమానిస్తారు

మిథునం – లోహపు వ్యాపారాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు.  అవివాహితులకు వివాహపరంగా శుభవార్తను అందుకోగలుగుతారు. ఊహ లోకాలలో విహరించే పరిస్థితికి స్వస్తి చెబుతారు

కర్కాటకం – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో మంచి క్రమశిక్షణ, విద్యారంగం పట్ల ఆసక్తి, ఆధునిక విద్య వినూత్న వ్యాపారాలలో శ్రద్ధ, రాణింపు ఉంటాయి.

సింహం – రుణాలు చాలా వరకు తీరుస్తారు. మంచి చెడు మీరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

కన్య – విద్యారంగం పట్ల ఆసక్తి చూపిస్తారు. సామాజిక సేవ కార్యక్రమాలకు మీకు చేతనైన విధంగా సహాయం చేస్తారు. అపనిందలకు భయపడకుండా మీరు చేయదలచుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు.

తుల – ఉన్నత స్థానాలను మేధస్సుతో సాధిస్తారు. దైవభక్తి శ్రద్ధ కలిగి ఉంటారు. అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయలేరు. న్యాయం, ధర్మం, సహదర్మం ఇవన్నీ పరిగణలోనికి తీసుకుంటారు.

వృశ్చికం – ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు. మీ ప్రాధాన్యత తగ్గదు. ప్రత్యామ్నాయం లేదు కనుక చాలామందికి మీరే దిక్కువుతారు.

ధనుస్సు – పని చేసే సామర్థ్యం నేర్పరితనం మిమ్ములను నిలబెడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. శుభవార్తలు వింటారు.

మకరం – మీ వాళ్లకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్స్. ప్రభుత్వపరమైన స్కీమ్స్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కుంభం – మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు కొంతమేరకు మాత్రమే మీ చేతికి అందుతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తి అవుతాయి. స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు సమసిపోతాయి.

మీనం – వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు, బంధువులతో విభేదాలు సంభవిస్తాయి. ప్రేమ పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. కొంత మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News