Monday, December 23, 2024

ఇద్దరు బిజెపి ఎంపీలపై ఎఫ్‌ఐఆర్..

- Advertisement -
- Advertisement -

ఇద్దరు బిజెపి ఎంపీలపై ఛత్తీస్‌గఢ్‌లో ఎఫ్‌ఐఆర్
రాహుల్‌పై నకిలీ వీడియోలు సృష్టించారని ఫిర్యాదు

న్యూఢిల్లీ: మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఒక నకిలీ వీడియో సృష్టించారని వచ్చిన ఫిర్యాదుపై బిజెపి ఎంపీలు రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్, సుబ్రత్ పాఠక్‌పై ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ ఇద్దరు ఎంపీలతోపాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు కాంగ్రెస్ పారీ మీడియా, పబ్లిసిటీ విభాగం చీఫ్ పవన్ ఖేరా సోమవారం తెలిపారు. రాహుల్ గాంధీపై నకిలీ వీడియోను సృష్టించారంటూ ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు ఖేరాతోపాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సుప్రియా శ్రీనాత్ విలేకరులకు తెలిపారు. రాహుల్ గాంధీపై బూటకపు వీడియోలు ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఈ వీడియోలను బిజెపి ట్విటర్ ఖాతాల నుంచి తొలగించాలని డిమాండు చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాసిన దరిమిలా కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది.

FIR Filed against 2 BJP MPs in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News