Wednesday, January 22, 2025

రాహుల్‌పై ట్వీట్: బిజెపి ఐటి సెల్ చీఫ్‌పై పోలీసు కేసు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన ట్వీట్లపై బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాలవీయపై బుధవారం బెంగళూరులో పోలీసు కేసు నమోదైంది. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్‌లో అమిత్ మాలవీయపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ నాయకుడు, కర్నాటక మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు నమోదు చేసిన ఫిర్యాదుపై ఐపిసిలోని 153ఎ, 120బి, 505(2), 34 సెక్షన్ల కింద అమిత్ మాలవీయపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై ఇటీవల ఒక వీడియో షేర్ చేసిన మాలవీయ రాహుల్ గాంధీ ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రమాదకారని, ఆయన ప్రమాదకర ఆట ఆడుతున్నారని అమిత్ మాలవీయ ఆరోపించారు. శామ్ పిట్రోడో లాంటి భారత వ్యతిరేకులు రాహుల్ గాంధీని ఆడిస్తున్నారని, వీరు ఇంకా ప్రమాదకారులని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని అఇబ్బందిపెట్టడానికి భారత్‌ను విదేశాలలో అప్రతిష్టపాల్జేయడానికి వీరు అన్నిరకాల ఎత్తుగడలకు పాల్పడుతున్నారంటూ మాలవీయ చేసిన ట్వీట్‌పై రమేష్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇలా ఉండగా&న్యాయ సలహా తీసుకున్న తర్వాతే కేసు నమోదు చేశామని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. చట్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడల్లా బిజెపి పెడబొబ్బలు పెడుతుందని, చట్టాలను అనుసరించడం వారికి ఒక సమస్య అని ఆయన అన్నారు.

దీనికి బెంగళూరు సౌత్ ఎంపి, బిజెపి నాయకుడు తేజస్వి సూర్య జవాబిస్తూ ఇది రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసని ఆరోపించారు. న్యాయం కోసం కోర్టులో పోరాడతామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News