Sunday, January 19, 2025

వందే భారత్‌ను ఢీకొన్న గేదెల యజమానులపై కేసు

- Advertisement -
- Advertisement -

ముంబై/అహ్మదాబాద్: ముంబై నుంచి గాంధీనగర్ వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గురువారం ఢీకొన్న గేదెల యజమానులపై గుజరాత్‌లోని రైల్వే రక్షణ దళం(ఆర్‌పిఎఫ్) శుక్రవారం కేసు నమోదు చేసింది. ఈ సంఘటనలో రైలు ముందుభాగం కొంత ధ్వంసమైన విషయం తెలిసిందే. గేదెలను ఢీకొనడంతో దెబ్బతిన్న రైలు ఇంజన్ ముందుభాగంలోని పైతొడుగును ముంబైలో కొత్త తొడుగుతో భర్తీ చేసినట్లు పశ్చిమ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగు గేదెలను ఢీకొంది. ఈ సంఘటనలో నాలుగు గేదెలు మరణించాయి. గురువారం సాయంత్రం సంఘటనకు సంబంధించి ఆ గేదెల యజమానులపై కేసు నమోదు చేసినట్లు పశ్చిమ రైల్వే అధికార ప్రతినిధి(అహ్మదాబాద్ డివిజన్) జితేంద్ర కుమార్ జయంత్ తెలిపారు. మరణించిన నాలుగు గేదెల యజమానులను ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు.

FIR filed against buffalo Owners after hit Vande Bharat Train

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News