Monday, December 23, 2024

విమానంలో స్మోక్ చేసిన కటారియాపై ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

FIR filed against Kataria for smoking in flight

న్యూఢిల్లీ: స్పైస్ జెట్ విమానంలో సిగరెట్ తాగుతున్న వీడియోతో సోషల్ మీడియాలో కనపడి తీవ్ర విమర్శల పాలైన బాడీ బిల్డర్ బాబీ కటారియాపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మంగళవారం పోలీసు అధికారులు వెల్లడించారు. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన లీగల్ అండ్ కంపెనీ అఫేర్స్ మేనేజర్ జస్బీర్ సింగ్ ఆగస్టు 13న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల బాబీ కటారియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2022 జనవరి 20న దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న స్పైస్‌జెట్ ఎస్‌జి 706 విమానంలో సిగరెట్ తాగుతూ లైటర్ చేతిలో పట్టుకున్న వీడియోను బల్వంత్ కటారియా అలియాస్ బాబీ కటారియా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారని జస్బీర్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది విమాన భద్రతా, రక్షణ చర్యలకు చెందిన నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. బాడీ బిల్డర్ అయిన కటారియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా..ఈ సంఘటనపై గతవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దర్యాప్తునకు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News