Thursday, April 24, 2025

‘ఆదిపురుష్’ వివాదం.. ప్రభాస్- నిర్మాతలపై ఎఫ్ఐఆర్

- Advertisement -
- Advertisement -

లక్నో: అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి శిశిర్ చతుర్వేది ‘ఆదిపురుష్’ చిత్ర నిర్మాతలు, నటీనటులపై హజ్రత్‌గంజ్ పోలీసుల స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హిందూ దేవుళ్ల చిత్రాలను అభ్యంతరకరమైన డైలాగులు, కాస్ట్యూమ్స్‌తో వక్రీకరిస్తూ హిందూ మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యపూర్వక ప్రయత్నమే ఈ చిత్రం అని చతుర్వేది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతర మతాల పెద్దలకు సంబంధించిన సినిమాలు తీసే ధైర్యం సినిమా నిర్మాతలకు లేదని ఆరోపించారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాలోని డైలాగులపై చిత్ర యూనిట్ స్పందించింది. అందులోని డైలాగులను మార్చనున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News