- Advertisement -
రాయ్‌పూర్: అల్లోపతి వైద్యంపై విమర్శలు చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహానికి గురైన యోగా గురు రాందేవ్ బాబాపై కేసు నమోదైంది. కొవిడ్ చికిత్సలో ఉపయోగించే మందులపై రాందేవ్ బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుపై చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఐఎంఎ చత్తీస్‌గఢ్ యూనిట్ ఫిర్యాదుపై రామకృష్ణ యాదవ్ అలియాస్ రాందేవ్‌పై కేసు నమోదైనట్టు రాయ్‌పూర్ సీనియర్ ఎస్‌పి అజయ్ యాదవ్ తెలిపారు. రాందేవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. రాందేవ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో హాస్పిటల్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ రాకేశ్ గుప్తా, ఐఎంఐ రాయ్‌పూర్ అధ్యక్షుడు వికాశ్ అగర్వాల్ తదితరులు ఉన్నారు.
FIR Lodged against Ramdev baba
- Advertisement -