Thursday, January 23, 2025

డిఫరెంట్ కంటెంట్ మూవీ

- Advertisement -
- Advertisement -

FIR movie pre release event

విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎఫ్‌ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఈనెల 11న విడుదల కానుంది. మాస్ మహరాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధు జొన్నలగడ్డ, సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా రవితేజ మాట్లాడుతూ “ఆరు నెలల క్రితం ఈ సినిమాను చూశాను. నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ కంటెంట్ సినిమా. ఇలాంటి చిత్రం నాకు కూడా చేయాలని ఉంది” అని అన్నారు. అదేవిధంగా వీడియో సందేశం ద్వారా గౌతమ్ మీనన్, రామ్ మాట్లాడారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ “విష్ణు విశాల్ ఇలాంటి మంచి కంటెంట్‌ను ఎలా ఎంపిక చేసుకుంటాడని నేను ఆలోచిస్తుంటాను. రవితేజను ఈ సినిమాకు సమర్పకుడిగా ఒప్పించడం మామూలు విషయం కాదు”అని తెలిపారు. విష్ణు విశాల్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం దర్శకుడు మను అద్భుతమైన డైలాగ్స్ రాశారు. మంజిమా, మోనిక అద్భుతంగా నటించారు” అని తెలిపారు. డైరెక్టర్ మను ఆనంద్ మాట్లాడుతూ “ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం నిర్మాత, హీరో విష్ణు. నా గురువు గౌతమ్ మీనన్ స్థాయిని తగ్గించకుండా ఉండేలా ఈ సినిమాను తెరకెక్కించాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా జ్వాలా, వాసు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News