Monday, December 23, 2024

శ్రీ రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

కర్నూల్: వివాదాస్పద సినీ ఫిగర్ శ్రీ రెడ్డిపై కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితలపై సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేశారు. టిడిపి అధికార ప్రతినిధి(బిసి విభాగం) రాజు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

సంఘంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల పరువు తీసేలా యూట్యూమ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో మాట్లాడుతున్న శ్రీ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాది కోరారు. అంతేకాక శ్రీ రెడ్డికి శిక్ష పడేలా చూడాలని కోరారు. రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News