భారతదేశంలో సిక్కుల పరిస్థితిపై తన అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూపై ఎఫ్‌ఐఆర్ నమోదు ఏసినట్లు గురువారం పోలీసులు తెలిపారు. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు ఒకరు చేసిన ఫిర్యాదు ఆధారంగా బిట్టూపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. భారత్‌లో సిక్కుల పరిస్థితి గురించి
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల తన అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ బాంబులు తయారుచేసేవారు ఆయనను సమర్థిస్తే ఆయనే నంబర్ ఒన్ ఉగ్రవాది అవుతారని ఆరోపించారు. బిట్టూ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ ఆయన మతితప్పి మాట్లాడుతున్నారంటూ విమర్శించింది. బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీసు స్టేషన్‌లో కేంద్ర మంత్రి బిట్టూపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.