Sunday, November 24, 2024

మిథున్ చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత మిథున్ చక్రవర్తిపై కోల్‌కతా పోలీస్‌లు బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పశ్చిమబెంగాల్ లోని నార్త్ 24 పరగణాల్లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అక్టోబర్ 27న సాల్ట్ లేక్ ఏరియా లోని ఒక కార్యక్రమంలో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ 2026లో పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం కానున్నదని , లక్షసాధనకు ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు ఓటు వేయకుండా ఎవరూ భయపెట్టలేరని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మోం మంత్రి అమిత్‌షా కూడా పాల్గొనడం గమనార్హం. దీనిపై మిథున్ రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఫిర్యాదులు అందడంతో బిదాన్ నగర్ సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మిథున్‌పై కేసు నమోదు చేయడాన్ని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఖండించారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే కేసు పెట్టారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News