Wednesday, January 22, 2025

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా రాజాసింగ్ శ్రీరాముడి శోభయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, అనుమతి లేకున్నా రాజాసింగ్ శోభయాత్ర నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని సుమోటోగా తీసుకున్నారు.

శోభయాత్ర ర్యాలీని పలు చోట్లు ఆపి బాణసంచా కాలుస్తూ, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని పోలీసులు రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారని ఆయన ఐపిసి 188, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు పోలీసులు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News