Monday, January 20, 2025

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేరళలో ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

కోచ్చి: వివిధ మతాల మధ్య విద్వేషాన్ని పెంపొందించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.

కోచ్చిలో ఇటీవల జరిగిన పేలుళ్లు, మలప్పురం జిల్లాలో ఒక ఇస్లామిక్ గ్రూపు నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి ఒకహమాస్ నాయకుడు చేసిన వర్చువల్ ప్రసంగంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై కేరళ పోలీసులు తమకు తాముగా కేసు నమోదు చేశారు. ఐపిసిలోని సెక్షన్ 153ఎ, కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 120 కింద కేంద్ర మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కోచ్చి నరానికి చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు.

గత ఆదివారం కోచ్చికి సమీపంలోని కలమస్సేరి వద్ద జెహోవా విట్నెసెస్ అనే మత సంస్థ నిర్వహించిన ప్రార్థనా సమావేశంలో బాంబు పేలుళ్లు సంభవించి నలుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ఐటి, ఎలెక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేకఱ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఘాటుగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కళంకితుడైన ముఖ్యమంత్రి(పినరయి నీచ సిగ్గుమాలిన బుజ్జగింపు రాజకీయాలు ఆడుతున్నారు. ఢిల్లీలో బైఠాయించి ఆయన ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంటే జిహాద్ కోసం బహిరంగ పిలుపులిస్తున్న ఉగ్రవాద హమాస్ అమాయక క్రైస్తవులపై దాడులు, బాంబు పేలుళ్లు జరుపుతోంది అంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడైన రాజీవ్ చంద్రశేఖర్‌ను అబద్ధాలకోరుగా, విషసర్పంగా అభివర్ణించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రకటనలు చేస్తే వారు కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులైనా సరే వారిపై కేసులు నమోదు పెడతామని ఆయన హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News