Monday, November 25, 2024

ఎస్‌పి ఎంపిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మొఘల్ కాలం నాటి మసీదు సర్వేకు కోర్టు ఆదేశించిన దరిమిలా జరిగిన ఘర్షణలకు సంబంధించి ఏడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన పోలీసులు సమాజ్‌వాది పార్టీ ఎంపి జియా ఉర్ రెహ్మాన్ బర్ఖ్, స్థానిక ఎస్‌పి ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సొహేల్ ఇక్బాల్‌ను నిందితులుగా చేర్చినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఇప్పటికే నిషేధాజ్ఞలను విధించిన జిల్లా యంత్రాంగం నవంబర్ 30 వరకు సంభాల్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించింది. సంభాల్ తహసిల్‌లో ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపివేసిన జిల్లా యంత్రాంగం అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. షాహీ జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తూ నిరసనకారులు ఆదివారం పోలీసులతో తలపడిన సందర్భంగా జరిగిన ఘర్షణలలో

ముగ్గురు వ్యక్తులు మరణించగా భద్రతా సిబ్బంది, అధికారులతోసహా అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరో వ్యక్తి సోమవారం మరణించడంతో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. హింసకు సంబంధించి ఏడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు జిల్లా ఎస్‌పి క్రిషన్ కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. బర్ఖ్, ఇక్బాల్‌తోసహా ఆరుగురితోపాటు 2,750 మంది గుర్తు తెలియని వ్యక్తులను కూడా నిందితులుగా చేర్చినట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశామని, ఇహింసతో సంబంధమున్న ఇతరులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నగరంలో శాంతి నెలకొందని, మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ సోమవారం కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News