- Advertisement -
రాంపూర్: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు, ఆయన వ్యాఖ్యలను సమర్థించిన ప్రియాంక్ ఖర్గేపై రాంపూర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
వారిద్దరిపై ఐపిసిలోని సెక్షన్ 295 ఎ, సెక్షన్ 153ఎ కింద ఇక్కడి సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.
స్టాలిన్ వ్యాఖ్యలు తమ మనోభావాలను గాయపరిచాయని పేర్కొంటూ న్యాయవాదులు హర్ష్ గుప్తా, రాం సింగ్ లోఢి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -