Monday, December 23, 2024

వినోద్ కాంబ్లీపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన భార్య దాడి చేయడంతో ఆమె అతడిపై పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు కాంబ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాంబ్లీ మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన భార్య ఆండ్రియాను బూతులు తిట్టాడు. ఆమెపై దాడి చేయడంతో తలకు గాయమైంది. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఆస్పత్రిలో చేరారు. కుకింగ్ పాన్ కర్ర తీసుకొని ఆమె తలపై బాదినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాంబ్లీ సతీమణి ఆండ్రియా ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపిసి 324, ఐపిసి 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News