Wednesday, January 22, 2025

బీహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు..

- Advertisement -
- Advertisement -

బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు ఇమెయిల్‌కు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు బీహార్ పోలీసులు తెలియజేశారు. ఈ కేసు జులై 16న జరిగిన ఘటనతో ముడిపడి ఉందని, బీహార్ సీఎం కార్యాలయానికి ఉగ్రవాద సంస్థ ‘అల్-ఖైదా’ పేరుతో ఇమెయిల్ పంపి, ఆవరణను పేల్చివేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

‘‘ఇది పాత కేసు.. విచారణ అనంతరం 2024 ఆగస్టు 2న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం’’ అని పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా తెలిపారు.  ఈ కేసులో లభ్యమైన ముఖ్యమైన వివరాల ప్రకారం.. సచివాలయ పోలీస్ స్టేషన్ SHO సంజీవ్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత భారతీయ న్యాయ సంహిత, IT చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా.. జూన్‌లో పాట్నా విమానాశ్రయానికి కూడా ఇదే విధమైన బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. పోలీసుల ప్రాథమిక విచారణ తర్వాత బాంబు బెదిరింపు బూటకమని తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News