Wednesday, January 22, 2025

కూకట్‌పల్లిలోని అమోర్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడి వాసులు ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కూకట్‌పల్లిలోని అమోర్‌ ఆస్పత్రిలో మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో రోగులు, వారి అటెండర్లు, ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News