Wednesday, January 22, 2025

మంజిత్ కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం మంజిత్ కాటన్ మిల్లులో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల కాటన్ మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మిల్లులో పత్తి విత్తనాలు భారీగా తగలబడుతున్నాయి. సుజాతనగర్ మండలం డేగలమడుగులో ఈ ఘటన చోటుచేసుకుంది.

మంటలు అంటుకోవడంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత వరక ఆస్తి నష్ఠం జరిగిందన్న విషయాలు తెలియాల్సిఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News