Thursday, January 9, 2025

భారీగా ఈత వనం దగ్ధం..రోడ్డున పడ్డ గీత కార్మికులు

- Advertisement -
- Advertisement -

కోరుట్ల : కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ శివారులోని ఈత వనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దగ్దం చేయడంతో పాటు కల్లు గొబ్బలను పగులగొట్టారని అయిలాపూర్ గీతా కార్మికులు కోరుట్ల పోలీసులకు, అబ్కారీ శాఖ అధికారులకు సోమవారం పిర్యాదు చేశా రు. గ్రామ శివారులో 10ఎకరాల విస్తీర్ణం లో ఉన్న ఈత చెట్లకు అరికుప్పల వెంకటి అనే వ్యక్తి నిప్పు పెట్టడం తో 2వేలకు పైనే ఈత చెట్లు కాలి బూడిద అయ్యాయని పిర్యాదులో పేర్కొన్నారు.

రోజు కల్లు అమ్మకం మీద ఆధారపడి జీవిస్తున్న దాదా పు 200 మంది గీత కార్మికులం రోడ్డున పడ్డామని పిర్యాదులో తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా ఈత చెట్లకు నిప్పు పెట్టిన వెంకటిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరుతున్నారు. సంఘటన స్థలాన్ని కోరుట్ల ఎస్‌ఐ చిర్ర సతీష్ కుమార్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News