- Advertisement -
రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఫార్మా కంపెనీలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. నందిగామ వద్ద ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. కొందరు కార్మికులు కిటీకీల్లోంచి బయటకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పలువురు కార్మికులు పరిశ్రమ లోపలే చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో పరిశ్రమలో 50 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడింది. నిచ్చెనలతో కార్మికులను కిందకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -