Saturday, February 22, 2025

పరవాడ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలోని పరవాడ లారస్ ఫార్మా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించి నలుగురు కార్మికులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ. 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News