Monday, December 23, 2024

మణికొండ ప్లేస్కూల్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ ప్లేస్కూల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన మణికొండలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లేస్కూల్‌లో ఉదయం ఎసిలో షార్ట్ సర్కూట్ కావడంతో క్లాస్ రూంలో మంటలు చెలరేగాయి. మంటలను చూసిన పిల్లలు ఒక్కసారిగా కేకలు వేయడంతో ఉపాధ్యాయులు క్లాస్ రూంకు చేరుకున్నారు.

వెంటనే క్లాస్‌లో ఉన్న 20మంది పిల్లలను బయటికి తీసుకుని వచ్చి వేరే పాఠశాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలను ఆర్పివేశారు. పాఠశాల యాజమాన్యం ఎలాంటి సమాధానం ఇవ్వడంలేదని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News