Thursday, January 23, 2025

ఎస్‌ఆర్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సికింద్రాబాద్ అగ్నిప్రమాదం మరవక ముందే మరో అగ్నిప్రమాదం ఎస్‌ఆర్ నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో అమూల్ ఐస్‌క్రీం గోడౌన్ ఉంది. ఇందులో ఉదయం షార్ట్‌సర్కూట్ రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదపు చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News