Thursday, December 19, 2024

అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

అచ్యుతాపురం: ఆంద్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని సాహితీ ఫార్మాలో పేలుడు చోటుచేసుకుంది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల అంతా దట్టమైన పొగ కమ్మేసింది. కార్మికులు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రి తరలించారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News