Wednesday, January 22, 2025

బచూపల్లిలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire Accident in Bachupally

హైదరాబాద్: నగరంలోని బచూపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోని బౌరంపేట్ ఇందిరమ్మ గృహల వద్ద కొబ్బరిపీచు గోదాంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా 2ఫైర్ ఇంజన్లతో సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Fire Accident in Bachupally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News