Sunday, December 22, 2024

బోరబండలో అగ్నిప్రమాదం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని బోరబండలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన పెట్టిన డీజిల్ క్యాన్లలో మంటలు చెలరేగాయి. మెకానిక్ షెడ్డులోని 2 వాహనాలకు మంటలు అంటుకున్నాయి. క్యాన్లలో డీజిల్ నింపి వాహనదారులకు చిల్లర వర్తకులు అమ్ముతున్నారు. బోరబండలో ఎండ వేడిమికి డీజిల్ క్యానల్లలో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. మంటలు ఎగిపడడంతో స్థానికులు పరుగులు తీశారు. మరికొందరు మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో స్పల్పంగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News