Tuesday, December 24, 2024

బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

Fire accident in Bus in Vishakhapatnam

 

అమరావతి: బస్సు వెనుక చక్రం నుంచి మంటల రావడంతో వాహనం నిమిషాల వ్యవధిలో అగ్నికీలలు ఉవ్వెత్తున చెలరేగిన సంఘటన విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురం కాన్వెంట్ కూడలి ఫ్లైఓవర్‌పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎపిఎస్‌ఆర్‌టిసికి చెందిన బస్సు 50 మంది ప్రయాణికులతో వాడచీపురుపల్లి నుంచి విశాఖకు బయలుదేరింది. కాన్వెంట్ కూడలి వంతెనపైకి రాగానే బస్సు వెనుక చక్రం నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన కండక్టర్ అప్రమత్తమై డ్రైవర్ తెలియజేశాడు. డ్రైవర్ బస్సును నిలిపి వేసి ప్రయాణికులను కిందకు దించారు. నిమిషాలలో వ్యవధిలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అప్పడే సిలిండర్ల లోడ్‌లో వస్తున్న లారీని 200 మీటర్లలో నిలిపి వేశారు. కండక్టర్ సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News