Thursday, January 23, 2025

చైనా షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనా జియాంగ్జీ ప్రావిన్స్ లోని షిన్‌యూ నగరంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. షాపింగ్ కాంప్లెక్స్‌లో మధ్యాహ్నం 3.24 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారి మంటలు చెలరేగి పక్కనున్న దుకాణాలకు వ్యాపించడంతో ఆ ప్రాంతం దట్టమైన పొగతో కమ్ముకుంది. షాపింగ్ కాంపెక్కులో చాలా మంది చిక్కుకుపోయారు.

సహాయక బృందాలు అక్కడకు చేరుకుని 120 మందిని కాపాడినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చైనా లోని భవనాలు, కర్మాగారాల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ఐదు రోజుల క్రితం హెనాన్ ప్రావిన్స్ లోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించి 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News